TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో కౌశిక్ రెడ్డి తనను దుర్భాషలాడారని, ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటానని ఆయనకు స్పీకర్ బదులిచ్చారు.