జహీరాబాద్ పట్టణంలోని పాత ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద పబ్లిక్ టాయిలెట్స్ నిరుపయోగంగా మారాయి. నిర్వహణ సరిగా లేక చెత్తకు నిలయంగా నిలుస్తున్నాయి. అక్కడే బీదర్ వెళ్లే మార్గం, మహారాష్ట్ర వైపు వెళ్లే ప్రయాణికులు అక్కడ బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. ప్రయాణికులకు కనీస సౌకర్యం అయినా మూత్ర శాలలను శుభ్రపరిచి, ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ఆ వైపుగా వెళ్లే ప్రయాణికులు స్థానిక అధికారులకు విన్నవించుకొంటున్నారు.