సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు స్టేషన్ లో జేబుదొంగలు రెచ్చిపోయారు. తమ చేతివాటం ప్రదర్శించి, డబ్బులు కాజేశారని, మంగళవారం సాయంత్రం సదాశివ పేట ప్రాంతానికి చెందిన కొందరు ప్రయాణికులు, పాత్రికేయుల ముందు బోరున విలపించారు.