జహీరాబాద్ ఆర్డిఓ రాజును మహబూబ్ నగర్ బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ పీఏ టూ స్పెషల్ అధికారిగా పనిచేస్తున్న రామ్ రెడ్డిని జహీరాబాద్ కు బదిలీ చేశారు. వీరు వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన ఆర్డీవో మంగళవారం బాధ్యతలు స్వీకరిస్తారని కార్యాలయవర్గాలను తెలిపాయి.