బాలికలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. బాలిక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి లోని బాలసదనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాలికలకు ఉన్న హక్కులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. కష్టపడి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.