ప్రజా సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని శంకర్ ఫంక్షన్ హాల్ లో సీపీఎం జిల్లా మూడవ మహాసభలను శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. జిల్లా కార్యదర్శి జయరాజ్, నాయకులు పాల్గొన్నారు.