సంగారెడ్డి జిల్లాలో సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్వేను పకడ్బందీగా చేయాలని సూచించారు సమావేశంలో అదరపు కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జడ్పి సీఈవో జానకి రెడ్డి పాల్గొన్నారు.