ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ చదివే అవకాశం ఉందని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి అన్నారు. కొండాపూర్ మండలం గొల్లపల్లిలో ఓపెన్ స్కూల్ పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. చదువు మధ్యలో మానేసిన వారిని చేర్పించాలని కోరారు.