రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రులు దామోదర రాజనసింహ, కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి లోని విద్యానగర్లో సమగ్ర కుటుంబ సర్వేను బుధవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి పాల్గొన్నారు.