వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడికి నిరసనగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావిద్, కార్యదర్శి రవి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, జిల్లా అధికారుల సంఘం నాయకులు జగదీష్ పాల్గొన్నారు.