ఇందిరమ్మ కమిటీలో మార్గదర్శకాలు పాటించాలని కోరుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు కలెక్టర్ కార్యాలయంలో గురువారం వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కొండల్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.