సంగారెడ్డి పట్టణంలో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ బుధవారం పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో కాటమయ్య కిట్లను పంపిణీ చేస్తారని చెప్పారు. 11 గంటలకు విద్యానగర్ సెయింట్ ఆంథోనీ పాఠశాల వద్ద సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ప్రమాణస్వీకారంలో పాల్గొంటారని తెలిపారు.