రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నెల16వ తేదీన జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో ట్రాఫిక్ పోలీసులకు బైకులను పంపిణీ చేస్తారని చెప్పారు. 11 గంటలకు శివంపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని వివరించారు.