అన్ని బ్యాంకులు పది రూపాయల నాణేలను స్వీకరించడం, ఇవ్వడం జరుగుతుందని ఆర్బిఐ రీజినల్ మేనేజర్ సుజాత అన్నారు. సంగారెడ్డి పట్టణంలో పది రూపాయల నాణేలపై ఏపీజీవీబీ బ్యాంకు ఆధ్వర్యంలో వ్యాపారులకు బుధవారం అవగాహన కల్పించారు. ఆర్బిఐ ఆదేశాల మేరకు ఈ ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఏపీజీవీబీ చీఫ్ మేనేజర్ ప్రకాశం పాల్గొన్నారు.