బొల్లారం మున్సిపాలిటీలో పండగపూట విషాదం

51பார்த்தது
దీపావళి పండుగ వేళ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలోని మల్లన్న బస్తీకి చెందిన మున్నా యాదవ్ ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన నష్టానికి అండగా ఉంటానని శనివారం భరోసా కల్పించారు. ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబానికి తన వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி