సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఐలా భవన్ లో బుధవారం సీపీఐ (ఎం) రాష్ట్ర 4వ మహాసభ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కార్మికులపై ప్రభావం అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చుక్క రాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.