గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లోని 7వ, సెమిస్టర్ విద్యార్థులు మంగళవారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్ లోని హింద్ వేర్ ఫ్యాక్టరీని సందర్శించారు. వారి ట్రూఫ్లో ఉత్పత్తులతో సహా పర్యావరణ హిత తయారీ పద్ధతుల గురించి అవగాహన ఏర్పరచుకున్నారు. తమ పాఠ్యాంశాలలో భాగమైన వర్కింగ్ డ్రాయింగ్ లపై దృష్టి సారించడమే గాక, ఆర్కిటెక్చరల్ మెటీరియల్స్ ఆచరణాత్మక వినియోగ విధానాలను స్వయంగా తెలుసుకున్నారు.