సమగ్ర కుటుంబ సర్వే పేరుతో అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఓటీపీలు అడిగితే చెప్పకూడదని మానూర్ ఎస్ఐ కోటేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. గ్రామ ఉపాధ్యాయులు ఎన్యుమరేటర్లుగా సర్వే చేస్తున్నారని వారు ఎలాంటి ఓటీపీలు అడగరని అన్నారు. మోసపూరిత ఓటీపీలు చెప్పి ప్రజలు మోస పోవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి సమయాల్లో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తారని పేర్కొన్నారు.