మండల కేంద్రంలోని రాయికోడ్ లో శుక్రవారం సాయంత్రం మహబూబ్ ఉస్మాని దర్గా సందల్, ఉర్సూ గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రదాన వీదుల గుండా గందం తీసుకుని ఊరేగింపుగా దర్గాకు వచ్చి మహబూబ్ ఉస్మానికి సమర్పించారు. అనంతరం శనివారం దర్గా దగ్గర అన్నదానం ఉందని కార్యక్రమ నిర్వహకులు తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం మైనారిటీలు మక్సుద్, ఫసియోద్దీన్, సల్లావుద్దీన్, షరీఫ్, శాదుల్, ఇస్మాయిల్, మైనోద్దీన్ పాల్గొన్నారు.