రాష్ట్ర హైకోర్టు జడ్జి విజయ్ సేన్ రెడ్డి శనివారం అల్లాదుర్గం వస్తున్నారని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు అల్లాదుర్గంలో కోర్టు కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారని చెప్పారు. ఆ తర్వాత మెదక్ చేరుకుని బార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం అవుతారని చెప్పారు.