దేశీయ కరెన్సీ రూపాయి విలువ మరోసారి జీవితకాల కనిష్ఠానికి చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం 5 పైసలు క్షీణించి రూ. 84.37 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ క్రమంలో ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయం రానున్న రోజుల్లో మార్కెట్ వృద్ధిని నిర్దేశిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఫెడ్ రేట్ల తగ్గింపు, డాలర్ బలహీనపడితే రూపాయి క్రమంగా బలపడుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు.