TG: హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ముగిసింది. మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 15 అంశాలకు ఆమోదం తెలిపారు. ఆరు టేబుల్ ఐటమ్స్‌కి కమిటీ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీకి రూ.700 కోట్ల విడుదలపై.. కమిటీ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎస్టేట్స్‌లో ఆదాయం, ఆస్తుల వివరాలు ఇవ్వాలని కమిటీ కోరింది.