కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డీఏ పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. తాజా పెంపుతో ఇప్పటివరకు ఉన్న 50శాతం డీఏ 53 శాతానికి చేరనుంది. ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచే దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల కేంద్ర ఖజానాపై రూ.9448 కోట్ల అదనపు భారం పడనుంది. డీఏ పెంపుతో దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.