TG: సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 35 సార్లు ఢిల్లీ వెళ్లినా మంత్రివర్గ విస్తరణ మాత్రం చేయలేకపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. SLBC వద్ద ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే సీఎం రేవంత్ మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, గాల్లో చక్కర్లు కొడుతున్నారని కేటీఆర్ అన్నారు.