ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన ఎంఎస్ఆర్ సేవా సంస్థల అధినేత సోమిరెడ్డి నరేందర్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర పర్యటన సందర్భంగా సీఎం బయల్దేరుతున్న క్రమంలో అంతకు ముందు సోమిరెడ్డి నరేందర్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదులు బి. రామకృష్ణారెడ్డి, కె. రాఘవేందర్ రెడ్డి తదితరులతో పాటు కలుసుకున్నారు.