వన్ టైం సెటిల్మెంట్ ద్వారా బకాయిలున్న నీటి బిల్లులను ఈ నెల 31 లోగా చెల్లించాలని శంషాబాద్ హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ హసీనా తెలిపారు. ఒకేసారి మొత్తం చెల్లింపు ద్వారా బకాయిలో ఉన్న ఆలస్య రుసుం లేకుండా వడ్డీ రాయితీని కూడా పొందే అవకాశం ఉందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.