షాద్ నగర్ పట్టణంలోని జానంపేట వివేకానంద కాలనీలో గల బసవన్న దేవాలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జానంపేట బసవన్న దేవాలయంలో ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందూ దేవాలయ దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.