షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు గున్న భీమయ్య యాదవ్ కుమారుడు గున్న మల్లేష్ యాదవ్ అనారోగ్యంతో సోమవారం మృతి చెందడం పట్ల మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎలికట్టలోని వారి నివాసానికి వెళ్లి గున్న మల్లేష్ పార్దివదేహానికి పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం గున్న భీమయ్యను పరామర్శించారు.