మనిషికి చదువు మూడో నేత్రం అంటారు. అలాంటి అక్షరానికే సంకల్ప సిద్ది వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్. ఒకవైపు ప్రజా సమస్యలు, పాలన వ్యవహారాలు చూసుకుంటూ దాతల సహకారంతో షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను అత్యాధునికంగా నిర్మించేందుకు సంకల్పించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాతలు స్పందించి శుక్రవారం భారీగా విరాళాలు అందజేస్తుండడంతో కళాశాల నిర్మాణం వేగం పుంజుకుంటుంది.