షాద్ నగర్ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎమ్మార్వో సరాఫ్ జగదీశ్వర్ నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం తన వంతు సహాయంగా 1 లక్ష రూపాయలు విరాళంగా మంగళవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కోసం తనవంతు ఆర్థిక సహకారం అందించిన సరపు జగదీశ్వర్ కు అభినందనలు తెలిపారు.