చలో ప్రజాభవన్ అంటూ ఆందోళన చేయనున్న రుణమాఫీ కాని రైతుల వ్యవహారంతో షాద్ నగర్ బీఆర్ఎస్ నాయకులను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం స్థానిక మున్సిపల్ చైర్మన్ కే నరేందర్ ను ఆయన స్వగృహం నుండి పోలీసులు అదుపులోకి తీసుకొని ముందస్తు చర్యగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతులకు వెంటనే రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం.