శివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల్లో వరుస విషాద ఘటనలు విషాదాన్ని నింపాయి. APలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది, TGలో ఇద్దరు మృతి చెందారు. తాగిపూడి దగ్గర గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు కాగా, తమ్మిలేరులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. శ్రీశైలం జలాశయం దగ్గర స్నానం చేస్తూ తండ్రీకొడుకులు మృతి చెందగా.. నెల్లూరులో విద్యార్థి గల్లంతయ్యారు. లంగర్‌హౌస్ చెరువులో నీట మునిగి ఇద్దరు మృతి చెందారు.