అఫ్గానిస్థాన్‌లో భారీగా మంచు, వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు 36 మంది మృతి చెందగా, మరో 40 మంది తీవ్రంగా గాగాయపడ్డారు. కొందరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ భారీ వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మరో వైపు మంచుతో కూడిన వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రజలు బయటకి రాకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.