హైదరాబాద్ జలసౌధలో ఏర్పాటు చేసిన కేఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి, ఈఎన్‌సీ పాల్గొన్నారు. శ్రీశైలం, సాగర్ నుంచి మే వరకు తమకు 55 టీఎంసీల నీరు కావాలని ఏపీ కోరింది. శ్రీశైలం, సాగర్ నుంచి మే వరకు తమకు 63 టీఎంసీల నీరు కావాలని తెలంగాణ కోరినట్లు అధికారులు వెల్లడించారు.