ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అఫ్గానిస్థాన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డు సెంచరీ చేశాడు. టోర్నీ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 177 పరుగుల భారీ సెంచరీ బాదాడు. ఇప్పటివరకు ఈ రికార్డు 165 పరుగులతో ఇంగ్లండ్‌కి చెందిన బెన్ డకెట్ పేరిట ఉండేది. డకెట్ ఇటీవల ఆస్ట్రేలియా మీద ఈ స్కోరు సాధించిన విషయం తెలిసిందే.