మే 3 న యాదవుల ఆత్మగౌరవ సభ

488பார்த்தது
మే 3 న యాదవుల ఆత్మగౌరవ సభ
విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్ధిక రంగాల్లో వాటా కొరకు మే 3 న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కో- ఆర్డినేటర్ చలకాని వెంకట్ యాదవ్ ప్రకటించారు. ఇందుకోసం రూపొందించిన పోస్టర్ ను నేడు రిటైర్డ్ జడ్జి మన్మోహన్ యాదవ్, సమాచార హక్కుచట్టం మాజీ చీఫ్ కమీషనర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్, యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబూరావ్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ తో కలిసి ఆయన హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

జనాభాలో యాదవులు, యాదవ ఉపకులాలన్నీ కలిసి 18 శాతం ఉన్నారు. గొర్రెలు కాసుకుంటూ ప్రకృతితో మమేకమై జీవిస్తూ అడవుల విస్తరణ చేస్తూ యావత్ సమాజానికి ప్రాణవాయువును అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న చెట్లు, అడవుల అభివృద్ధి వెనుకాల యాదవుల శ్రమ ఎంతో ఉందన్నారు. అలాంటి గొప్పజాతికి సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని అన్నారు. అనేక చోట్ల గొర్రెల కాపరులపై అగ్ర కులాల కుట్రలతో అట్రాసిటీ చట్టాలు నమోదు చేయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా వృత్తినే నమ్ముకుని సంచార జీవులుగా, అడవిబిడ్డలుగా జీవనం సాగిస్తున్న యాదవులకు విద్యా, ఉద్యోగ, ఆర్ధిక రంగాల్లో ప్రోత్సాహం కరువైందన్నారు. ప్రకృతంత సహజంగా ఉంటూ జీవాల పట్లనే కాదు సమాజం పట్లకూడా సమన్యాయం పాటించే యాదవులను రాజకీయాల్లో రాణించకుండా అన్ని రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయన్నారు. యాదవులు రాజకీయాల్లో రాణిస్తే మంద కావలి ఉండి తొడేళ్ళ భారినుంచి జీవాల రక్షించుకున్నట్టే రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షిస్తారన్నారు. ఇది గిట్టని అగ్రకుల తోడేళ్ళు ఓట్లను వాడుకుంటున్నారే కానీ యాదవులకు రాజకియాల్లో ప్రాధాన్యత, రాజ్యాధికారం ఇవ్వడం లేదన్నారు. బడ్జెట్ లో యాదవులకు 18 శాతం నిధుల్ని కేటాయించాలని, గొర్రెల స్కీం డబ్బులను దళిత బంధు పథకంలాగే డైరెక్ట్ గా యాదవుల అకౌంట్లలో జమ చేయాలని, అగ్రకులాలవారు యాదవులపై కావాలని పెట్టించిన ఎస్సీ, ఎస్టీ, ఎట్రాసిటీ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

మే 3 న జరిగే సభలో రాష్ట్రంలోని యాదవ విద్యార్థి, యువజన, ఉద్యోగ, మేధావులు, మహిళలు, వృత్తిదారులు అంతా పెద్దఎత్తున పాల్గొని యాదవ ఆత్మగౌరవ గుండె చప్పుడును దశదిశలా వ్యాపింప చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ, యాదవ విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షులు ఎం వెంకన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ యాదవ్, కోశాధికారి దరబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎక్జిక్యూటివ్ మెంబర్ దుడిమెట్ల శ్రీనివాస్ యాదవ్, యాదవ మహాసభ జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ యాదవ్, నల్గొండ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ యాదవ్, జాతీయ కౌన్సిల్ మెంబర్ యేషాం మనీష్ యాదవ్, రాష్ట్ర యువజన కార్యదర్శి యేషాం మల్లేష్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు విజయ్ యాదవ్, సంగారెడ్డి జిల్లా యువజన అధ్యక్షులు సంతోష్ యాదవ్, ఆర్ ఎన్ గౌతం యాదవ్, టీచర్ శ్రీనివాస్ యాదవ్, సాంబశివ యాదవ్, విష్ణు యాదవ్, దుడిమెట్లా శ్రీనివాస్ యాదవ్, నోములసైదులు యాదవ్, వీరన్న యాదవ్, వెటర్నరీ డిపార్ట్మెట్ డాక్టర్ నాగరాజ్ యాదవ్, బలరామ్ యాదవ్, సబ్ రిజిస్ట్రార్, నోముల గాయిత్రి యాదవ్, డా. రామదేవి యాదవ్, పారిజాత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி