ఉద్యమం ముసుగులో మాజీ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు, ఉద్యమకారులను తీవ్రంగా మోసం చేశారని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఆరోపించారు. ఆయన బాధితులు చాలా మంది ఉన్నారని, టీఆర్ఎస్ ఆవిర్భావ సభ్యుడిగా ఉన్న తనను తెలంగాణ భవన్ నుంచి బయటకు గెంటేశారని అన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన చేస్తున్నారని, ఆయనకు రాష్ట్ర ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.