షాద్ నగర్ గుడిపై దాడి.. బీజేపీ ఫైర్
షాద్ నగర్ సమీపంలోని వివేకానంద కాలనీలో బసవన్న దేవాలయంలో దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అనేక దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే విషయం వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.