విద్యుత్ సంబంధ మరమ్మతు పనుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు రాజేంద్రనగర్ విద్యుత్ అధికారులు తెలిపారు. గాంధీనగర్ విద్యుత్ ఫీడర్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఐసీఎం, నార్మ్ విద్యుత్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు.