పిల్లలు పుట్టడం లేదని ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
పిల్లలు పుట్టడం లేదని స్వాతి అనే వివాహిత బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమావతిపేట్ లో నివాసం ఉండే ఎల్లా రెడ్డి కుమార్తె స్వాతి రెడ్డి(30)కి ఉప్పరపల్లికి చెందిన శ్రీధర్ రెడ్డి తో 2013లో వివాహం జరగగా ఇప్పటి వరకు సంతానం కలగలేదు. రెండు సార్లు గర్భం దాల్చినప్పటికి వివిధ కారణాలతో గర్భస్రావమైంది. దీంతో తీవ్ర ఆవేదన చెందుతూ ఆరు నెలలుగా తన పుట్టింట్లోనే ఉంటూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.