హైదరాబాద్ నగరంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పని జరగాలన్నా హైకమాండ్ ఆదేశాలు కావాలి. చిన్న చిన్న కార్పొరేషన్ పదవులకు హైకమాండ్ ఆజ్ఞ లేనిది ఇవ్వరు. అలాంటిది హైకమాండ్ ఆదేశాలు లేనిదే అదానీతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటుందా అన్నారు.