నాలుగైదు రోజులుగా ఆహారం లేకుండా అచేతనగా పడి ఉన్న ఓ వృద్ధురాలి పట్ల శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ మానవత్వం చూపారు. మధురానగర్ కాలనీలో ఓ వృద్ధురాలు రోడ్డు పక్కనే నాలుగైదు రోజులుగా పడుకుని ఉండటంతో కొందరు చేరదీసి కొంత ఆహారాన్ని అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ వృద్ధురాలిని దగ్గరుండి 108 అంబులెన్స్ లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.