రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండల పరిధిలోగల గ్రామాలలో ఏర్పాటుచేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం స్థానిక శాసనసభ్యులు కాల యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.