నూతన విద్యా విధానం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ తెలిపారు. మంగళవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కిస్మత్ పూర్ లో 40లక్షలతో నూతనంగా నిర్మించిన గండిపేట మండల విద్యావనరుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పేద విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సర్కారు బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.