రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి కాటేదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ నెయ్యి కేంద్రంపై రాజేంద్రనగర్ ఎస్ వో టి పోలీసులు గురువారం దాడులు నిర్వహించినట్లు తెలిపారు. అపరిశుభ్ర వాతావరణంలో, నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మైలర్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.