ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో 4. 23 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కోట్లు వెచ్చించి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు.