రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవి పల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్ లో బుధవారం విద్యుత్ ట్రాన్స్ఫారం కి కనెక్ట్ అయి ఉన్న కరెంటు వైర్ తెగి క్రింద పడింది. దీంతో విద్యుత్ కు అంతరరాయం కలికింది. ఈ సమస్యను స్థానికులు బీజేపీ డివిజన్ ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు కుర్మయ్య దృష్టికి తెచ్చారు. ఆయన వెంటనే స్పందించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం విద్యుత్ సిబ్బంది సమస్యను పరిష్కారం చేశారు.