మూసీ సుందరీకరణలో భాగంగా మొదటి దశలో నదీ గర్భంలోని ఇళ్లను కూల్చాలని గతంలోనే నిర్ణయించింది. ఇప్పటి వరకు అధికారులు 150 ఇళ్లను కూల్చగా. ఇంకా 2, 166 నిర్మాణాలున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో హైదరాబాదులోనే మూసి నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను కూల్చే ప్రక్రియను రేపటి నుంచి మొదలుపెట్టనున్నారు. పండుగల నేపథ్యంలో గత పది రోజులుగా కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చిన ప్రభుత్వం రేపటి నుంచి మళ్లీ పనులు మొదలు పెట్టనుంది.