రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పై ఉప్పర్ పల్లి పిల్లర్ నెంబర్ 185 వద్ద సోమవారం విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి కారు బోల్తా కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఎక్స్ప్రెస్ వే పై కారు రోడ్డుకు అడ్డంగా పడి పోవడంతో భారీ గా వాహనాలు నిలిచిపోయాయి. శంషాబాద్ నుండి ఎక్స్ప్రెస్ వే మీదుగా మెహదీపట్నం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.