మలక్ పేట్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టడంతో ఎల్బీనగర్ జోన్, సరూర్నగర్ సర్కిల్ -5 జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని శ్రీకోదండరాం నగర్ కాలనీలో సర్వే బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ జిహెచ్ఎంసి కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఐఏఎస్, కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ పాల్గొన్నారు.